టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత దీక్ష సోమవారానికి వాయిదా

26-01-2022 Wed 21:11
  • నారీ సంకల్ప దీక్షను చేపట్టనున్న అనిత
  • శుక్రవారం చేపట్టాలనుకున్న దీక్ష
  • ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదన్న అనిత
  • 31వ తేదీన విజయవాడలో దీక్ష చేపడతానని వెల్లడి
Anitha deeksha postponed to Jan 31
టీడీపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత దీక్షను చేపట్టబోతున్నారు. 'నారీ సంకల్ప దీక్ష' పేరుతో ఈ దీక్షను చేపట్టనున్నారు. వాస్తవానికి శుక్రవారం నాడు దీక్షను చేపట్టాలని భావించినప్పటికీ ఆమె దీక్ష వాయిదా పడింది. తన దీక్షకు ప్రభుత్వం అనుమతిని ఇవ్వలేదని... అందుకే సోమవారానికి దీక్షను వాయిదా వేశానని ఆమె తెలిపారు.

ఈ నెల 31న విజయవాడలో దీక్షను చేపడతానని ఆమె చెప్పారు. మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందని ఆమె విమర్శించారు. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. నిత్యావసరాల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయని... వీటన్నింటినీ నిరసిస్తూ తెలుగు మహిళ ఆధ్వర్యంలో దీక్ష చేపడుతున్నట్టు తెలిపారు.