'బంగార్రాజు' 10 రోజుల వసూళ్లు!

26-01-2022 Wed 18:54
  • సంక్రాంతికి వచ్చిన 'బంగార్రాజు'
  • తొలి రోజునే హిట్ టాక్
  • విడుదలైన ప్రతిచోటున భారీ వసూళ్లు
  • సంక్రాంతి విజేతగా నిలిచిన చిత్రం  
Bangarraju Movie Update
నాగార్జున, నాగచైతన్య ప్రధానమైన పాత్రలను పోషించిన 'బంగార్రాజు' ఈ నెల 14వ తేదీన భారీ స్థాయిలో విడుదలైంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగార్జున సరసన నాయికగా రమ్యకృష్ణ ఆకట్టుకోగా, చైతూ జోడీగా కృతిశెట్టి అందాల సందడి చేసింది.

అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, విడుదలైన తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోయింది. ఈ సినిమా ప్రేక్షకులను పలకరించి 10 రోజులు దాటిపోయింది. 10 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 66 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టడం విశేషం.

గ్రామీణ నేపథ్యంతో కూడిన కథ .. సంక్రాంతి పండగ సంబంధమైన అంశాలు .. స్వర్గంలో బంగార్రాజు సందడి .. అనూప్ రూబెన్స్ పాటలు .. నాగలక్ష్మి పాత్రలో కృతిశెట్టి అల్లరి .. ఇవన్నీ కూడా ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించాయని అంటున్నారు. రేపటితో ఈ సినిమా రెండు వారాలను పూర్తిచేసుకోనుంది. ఆ టోటల్ వసూళ్లు ఎలా ఉంటాయనేది చూడాలి.