అతను లేకపోవడం వల్లే టీమిండియా ఓడిపోయింది: దక్షిణాఫ్రికా క్రికెటర్ డేల్ స్టెయిన్

26-01-2022 Wed 17:19
  • రవీంద్ర జడేజా లేకపోవడం వల్లే ఇండియా ఓడిపోయింది
  • జడేజా అద్భుతమైన ఆటగాడు
  • బంతితో, బ్యాటుతో ఆటను మలుపు తిప్పగల సమర్థుడు
Team India lost ODI series because Ravindra Jadeja not played says Dale Steyn
దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో టీమిండియా ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ను సౌతాఫ్రికా 3-0 తేడాతో గెలుచుకుంది. భారత ఘోర పరాజయంపై దక్షిణాఫ్రికా క్రికెటర్ డేల్ స్టెయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా లేకపోవడం వల్లే టీమిండియా ఓడిపోయిందని అభిప్రాయపడ్డాడు.

జడేజా అద్భుతమైన ఆటగాడని స్టెయిన్ కితాబునిచ్చాడు. తన స్పిన్ మాయాజాలంతో ఆటను మలుపు తిప్పగల సమర్థుడని, బ్యాట్ తో కూడా రాణించి జట్టుకు విజయం అందించగల ఆటగాడని అన్నాడు. భారత్ కు బౌలింగ్ విభాగంలో కొంత సమస్య ఉందని చెప్పాడు. బుమ్రాకు అండగా ఒక మంచి బౌలర్ అవసరమని తెలిపాడు. టెస్ట్ సిరీస్ లో షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడని కితాబునిచ్చాడు.