Bonda Uma: వియ్యంకులు కాబోతున్న టీడీపీ నేతలు బొండా ఉమ, ఏవీ సుబ్బారెడ్డి

Bonda uma son and AV Subba Reddy daughter getting marriage
  • బొండా ఉమ కుమారుడు సిద్ధార్థ్, సుబ్బారెడ్డి కుమార్తె జస్విత రెడ్డిల పెళ్లి
  • అమెరికాలో ఇద్దరూ కలిసి చదువుకున్న వైనం
  • ప్రస్తుతం టీడీపీ కార్యకలాపాల్లో బిజీగా ఉన్న కాబోయే వధూవరులు
టీడీపీకి చెందిన ఇద్దరు నేతలు వియ్యమందుకుబోతున్నారు. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ, ఆళ్లగడ్డ నియోజకవర్గ నేత, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ మాజీ ఛైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి వియ్యంకులు కాబోతున్నారు. బొండా ఉమ కుమారుడు సిద్ధార్థ్, సుబ్బారెడ్డి కుమార్తె జస్విత రెడ్డిలు పెళ్లాడబోతున్నారు. అమెరికాలో వీరిద్దరూ కలిసి చదువుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ టీడీపీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. పెళ్లికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ పెళ్లిపై టీడీపీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.
Bonda Uma
AV Subba Reddy
Telugudesam
Son
Daughter
Marriage

More Telugu News