ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణరాజు కృతజ్ఞతలు

26-01-2022 Wed 15:15
  • పద్మ అవార్డులు ప్రకటించడం పట్ల ధన్యవాదాలు
  • పద్మభూషణ్ అందుకున్న సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ లకు శుభాకాంక్షలు
  • తెలంగాణ కిన్నెర కళాకారుడు మొగిలయ్యకు అభినందనలు
Raghu Rama Krishna Raju Thanks PM Modi
ప్రధాని నరేంద్ర మోదీకి నరసాపురం ఎంపీ కె. రఘురామకృష్ణరాజు కృతజ్ఞతలు తెలిపారు. వివిధ రంగాల్లో విశేష సేవలందించి, ఆయా రంగాల అభివృద్ధికి దోహదపడిన వారికి పద్మ అవార్డులను ప్రకటించడంపై ఆయన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, అవార్డులు అందుకున్న తెలుగు ప్రముఖులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. పద్మశ్రీ అందుకున్న తెలంగాణ కిన్నెర గాన కళాకారుడు మొగిలయ్యకు అభినందనలు తెలిపారు.

పద్మభూషణ్ పురస్కారం అందుకున్న మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. పద్మశ్రీకి ఎంపికైన ప్రముఖ వైద్యుడు డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు, కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య, ప్రముఖ నటి షావుకారు జానకి, ఫోన్ కళాకారుడు రామచంద్రయ్య, కూచిపూడి నృత్య కళాకారిణి పద్మజారెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు. నాదస్వర కళాకారుడు స్వర్గీయ గోసవీడు షేక్ హసన్ గారికి పద్మశ్రీ రావడం అభినందనీయమన్నారు.