రవితేజ బర్త్ డే సందర్భంగా కొత్త పోస్టర్ల రిలీజ్!

26-01-2022 Wed 11:56
  • రిలీజ్ కి సిద్ధమైన 'ఖిలాడి'
  • ముగింపు దశలో 'రామారావు ఆన్ డ్యూటీ'
  • సెట్స్ పైనే ఉన్న 'ధమాకా'
  • పూజా కార్యక్రమాలు జరుపుకున్న 'రావణాసుర'
Raviteja movies update
రవితేజ ఈ ఏడాది వరుసగా థియేటర్లలో తన సినిమాలు దింపేయడానికి రెడీ అవుతున్నాడు. 'ఖిలాడి' .. 'రామారావు ఆన్ డ్యూటీ' .. 'ధమాకా' .. 'రావణాసుర' .. 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ రోజున రవితేజ పుట్టినరోజు కావడంతో ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ సినిమాలకి సంబంధించిన కొత్త పోస్టర్లను వదులుతున్నారు.రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన 'ఖిలాడి' సినిమా వచ్చేనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మీనాక్షి చౌదరి .. డింపుల్ హయతి ఆయన సరసన అందాల సందడి చేయనున్నారు. ఆ తరువాత సినిమాగా ఆయన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా దివ్యాన్ష కౌశిక్ అలరించనుంది.ఇక నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో 'ధమాకా'ను కూడా రవితేజ సెట్స్ పైకి తీసుకుని వెళ్లాడు. అలాగే సుధీర్ వర్మ దర్శకత్వంలో 'రావణాసుర' సినిమా పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేశాడు. త్వరలో 'టైగర్ నాగేశ్వరరావు' కూడా పట్టాలెక్కనుంది. మొత్తానికి రవితేజ ఎక్కడ ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా మాంఛి జోరు చూపిస్తున్నాడు.