'గుడ్ లక్ సఖి' ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి

25-01-2022 Tue 22:16
  • కీర్తి సురేశ్ ప్రధానపాత్రలో గుడ్ లక్ సఖి
  • నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో చిత్రం
  • జనవరి 26న పార్క్ హయత్ హోటల్లో ప్రీ రిలీజ్ వేడుక
Megastar Chiranjeevi will attend to Good Luck Sakhi pre release event
కీర్తి సురేశ్ ప్రధానపాత్రలో నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'గుడ్ లక్ సఖి'. రైఫిల్ షూటింగ్ క్రీడ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కింది. కాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 26న హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నారు.

ఇక 'గుడ్ లక్ సఖి' చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతిబాబు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రం జనవరి 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా, చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'భోళా శంకర్' చిత్రంలో నటిస్తున్నారు. కీర్తి సురేశ్ ఈ చిత్రంలో చిరు చెల్లెలి పాత్ర పోషిస్తోంది.