పీఆర్సీ అమలుపై మరోసారి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కారు

25-01-2022 Tue 21:37
  • పీఆర్సీపై కొనసాగుతున్న ప్రతిష్టంభన
  • కొత్త పీఆర్సీపై ఉద్యోగుల అసంతృప్తి
  • ఫిబ్రవరి 7 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపు
  • ఉద్యోగులను చర్చలకు పిలుస్తున్న ప్రభుత్వం
  • మరోవైపు పీఆర్సీ అమలుకు చర్యలు
AP Govt issues fresh orders on PRC implementation
ఓవైపు పీఆర్సీ జీవోలను రద్దు చేయాల్సిందేనంటూ ఉద్యోగులు ఉద్యమం చేస్తుండగా, ఏపీ సర్కారు మాత్రం నూతన పీఆర్సీ అమలుపై పట్టుదలగా ఉంది. తాజా పీఆర్సీ జీవో ప్రకారం జీతాలు, పెన్షన్ బిల్లులు ఎలా రూపొందించాలో విధివిధానాలపై ట్రెజరీ అధికారులు, డీడీఓలకు మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు, పెన్షన్ బిల్లులు ప్రాసెస్ చేయాలంటూ ఆర్థిక శాఖ తన తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ఓవైపు చర్చలకు సిద్ధమేనంటూ ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం పలుకుతున్న ప్రభుత్వం, నూతన పీఆర్సీ అమలులో వెనక్కి తగ్గేది లేదని తన చర్యల ద్వారా స్పష్టం చేస్తోంది. పీఆర్సీపై జారీ చేసిన జీవోలను ఉపసంహరించుకోకపోతే ఫిబ్రవరి 7 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు ఉద్యోగ సంఘాలు ప్రకటించడం తెలిసిందే.