Meda Mallikarjuna Reddy: రాజంపేటను 'అన్నమయ్య జిల్లా'గా చేయండి... సీఎంకు లేఖ రాసిన ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి

Rajampeta MLA Meda Mallikarjuna Reddy wrote CM Jagan for new district
  • ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన
  • అన్నమయ్య జన్మస్థలం రాజంపేటలోనే ఉందన్న మేడా
  • రాజంపేటలో విలువైన సంపద ఉందని వెల్లడి
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుండడం తెలిసిందే. పార్లమెంటు నియోజకవర్గాల ఆధారంగా కొత్త జిల్లాల ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో ఉంది. ఈ నేపథ్యంలో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సీఎం జగన్ కు లేఖ రాశారు. రాజంపేటను జిల్లాగా చేయాలని మల్లికార్జునరెడ్డి కోరారు. రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. అన్నమయ్య జన్మస్థలం రాజంపేటలోనే ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రాజంపేటలో విలువైన సంపద ఎక్కువగా ఉందని తెలిపారు.
Meda Mallikarjuna Reddy
CM Jagan
Annamayya District
Rajampeta
YSRCP
Andhra Pradesh

More Telugu News