చినజీయర్ స్వామిని దర్శించుకున్న ఏపీ మంత్రి వెల్లంపల్లి

25-01-2022 Tue 17:33
  • ఫిబ్రవరి 2 నుంచి శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు
  • 5వ తేదీన రామానుజుల విగ్రహావిష్కరణ
  • ఉత్సవ విశేషాలను అడిగి తెలుసుకున్న మంత్రి  
Vellampalli meets China Jeeyar Swamy
చిన జీయర్ స్వామివారిని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఆయనతో పాటు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఉత్సవ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. 5వ తేదీన చేపట్టనున్న 216 అడుగుల రామానుజుల విగ్రహావిష్కరణ విశేషాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ నుంచి ఇద్దరు లైజనింగ్ అధికారులను నియమించామని చిన జీయర్ కు వెల్లంపల్లి తెలిపారు. మరోవైపు ఈ ఉత్సవానికి రాష్ట్రపతి కోవింద్, ప్రధానమంత్రి మోదీ తదితరులు కూడా హాజరుకానున్నారు.