ఏపీలో కొత్తగా 13,819 కరోనా కేసులు, 12 మరణాలు... తాజా బులెటిన్ ఇదిగో!

25-01-2022 Tue 17:16
  • గత 24 గంటల్లో 46,929 కరోనా టెస్టులు
  • విశాఖ జిల్లాలో 1,988 కొత్త కేసులు
  • పెరిగిన రోజువారీ మరణాల సంఖ్య
  • లక్ష దాటిన యాక్టివ్ కేసులు
AP Corona cases latest bulletin
ఏపీలో గడచిన 24 గంటల్లో 46,929 కరోనా పరీక్షలు నిర్వహించగా 13,819 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,988 కొత్త కేసులు నమోదు కాగా, ప్రకాశం జిల్లాలో 1,589 కేసులు, గుంటూరు జిల్లాలో 1,422 కేసులు, అనంతపురం జిల్లాలో 1,345 కేసులు, నెల్లూరు జిల్లాలో 1,305 కేసులు, కర్నూలు జిల్లాలో 1,255 కేసులు, కడప జిల్లాలో 1,083 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 1,001 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 5,716 మంది కరోనా నుంచి కోలుకోగా, 12 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,561కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 22,08,955 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,92,998 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. ఏపీలో ప్రస్తుతం 1,01,396 మంది చికిత్స పొందుతున్నారు.