తమిళనాడు ఆటోడ్రైవర్ పై ప్రశంసలు కురిపించిన కేటీఆర్

25-01-2022 Tue 15:02
  • ఆటోలో వైఫై, ఫ్రిడ్జ్ వంటి సదుపాయాలను కల్పించిన ఆటోడ్రైవర్
  • ఆటోను ప్రపంచ స్థాయి సదుపాయాలతో తీర్చిదిద్దాడన్న కేటీఆర్
  • ఫస్ట్ క్లాస్ క్యాబిన్ లా తయారు చేశాడని ప్రశంస
KTR appreciates Tamil Nadu auto driver
తమిళనాడుకు చెందిన ఆటోడ్రైవర్ అన్నాదురైపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఆటోను ప్రపంచ స్థాయి సదుపాయాలతో తీర్చిదిద్దాడని కితాబునిచ్చారు. ఫస్ట్ క్లాస్ క్యాబిన్ లా తన ఆటోను తయారు చేశాడని ప్రశంసించారు. ఇదొక గొప్ప ఆలోచన అని అన్నారు.

అన్నాదురై గత 10 ఏళ్లుగా చెన్నైలో ఆటో నడుపుతున్నాడు. తన ఆటోలో ఫ్రీ వైఫై, స్నాక్స్, కూల్ డ్రింక్స్ ఉన్న ఫ్రిడ్జ్, లాప్ టాప్, ఐపాడ్ వంటివి ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా అన్నాదురై మాట్లాడుతూ, కస్టమర్లే తనకు ప్రధానమని... డబ్బు కంటే తనకు కస్టమర్ల సంతోషమే ముఖ్యమని చెప్పారు.