ముంబయి నుంచి కారవాన్ తెప్పించుకున్న సీనియర్ నటుడు నరేశ్

25-01-2022 Tue 14:59
  • టాలీవుడ్ లోనూ కారవాన్ కల్చర్
  • ఏసీ కారవాన్ కొనుగోలు చేసిన నరేశ్
  • అన్ని సదుపాయాలతో కారవాన్
  • వేరొకరు వాడినది కొనడం ఇష్టంలేదన్న నరేశ్
Tollywood senior actor Naresh buys Caravan
గతంతో పోల్చితే ఇటీవల కాలంలో టాలీవుడ్ లో కారవాన్ కల్చర్ బాగా పెరిగింది. దాదాపు అగ్రహీరోలందరికీ సొంత కారవాన్ లు ఉన్నాయి. తాజాగా సీనియర్ నటుడు నరేశ్ కూడా కారవాన్ కొనుగోలు చేశారు. అన్ని హంగులతో కూడిన కారవాన్ ను ముంబయి నుంచి తెప్పించినట్టు వెల్లడించారు. ఇతరులు వాడిన కారవాన్ కంటే కొత్తది కొనుక్కోవడమే మేలని భావించానని నరేశ్ తెలిపారు.

నటుల జీవితాల్లో 70 శాతం కాలం కారవాన్ లలోనే గడిచిపోతుంటుందని అభిప్రాయపడ్డారు. అందుకే తన అవసరాలకు అనుగుణంగా కొత్త కారవాన్ కొనుక్కున్నానని నరేశ్ తెలిపారు. ఈ ఏసీ కారవాన్ లో బెడ్, జిమ్, మేకప్ రూమ్, వెయిటింగ్ రూమ్, వాష్ తదితర సదుపాయాలు ఉన్నాయి. కాగా, టాలీవుడ్ లో కారవాన్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేశ్ అనే చెప్పాలి.