రెడ్మీ నోట్ 11ఎస్ విడుదల ఫిబ్రవరి 9న

25-01-2022 Tue 14:23
  • అధికారికంగా ధ్రువీకరించిన రెడ్మీ
  • సంబంధిత పోస్టర్ విడుదల
  • రెండు రకాల వేరియంట్లతో మార్కెట్లోకి
  • 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం
Redmi Note 11S launch next month
చైనాకు చెందిన షావోమీ బ్రాండ్ రెడ్మీ నోట్ 11ఎస్ విడుదలను ధ్రువీకరించింది. భారత మార్కెట్లో ఫిబ్రవరి 9న దీనిని విడుదల చేయనుంది. వెనుక భాగంలో రెక్టాంగ్యులర్ కెమెరా సెటప్ ను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి షావోమీ అధికారిక పోస్టర్ ను విడుదల చేసింది. డార్క్ బ్లూ కలర్ నోట్ 11ఎస్ ఫోన్ పోస్టర్ లో కనిపిస్తోంది.

ఇక ఇందులో ఉండే ఫీచర్లపై వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. లీక్ అయిన వివరాలను పరిశీలిస్తే.. మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్, 6.4 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, 90 హెర్జ్ స్క్రీన్ రీఫ్రెష్ రేటు, 108 మెగాపిక్సల్ తో వెనుక ప్రధాన కెమెరా తదితర ఫీచర్లతో ఉంటుందని సమాచారం. 6జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజీ, 4జీబీ/64జీబీ వేరియంట్ లలో లభిస్తుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దాదాపు ఇది 5జీ ఫోన్ అయి ఉంటుందని మార్కెట్ అంచనా వేస్తోంది.