Nara Lokesh: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ మొండి పట్టు పడుతోంది: నారా లోకేశ్

  • అన్ని రాష్ట్రాలు పరీక్షలు వాయిదా వేశాయి
  • ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ మాత్రం మొండి పట్టు పడుతోంది
  • 3 వేల మంది విద్యార్థుల్లో సుమారు 600 మంది కరోనా బారిన పడ్డారు
NTR Health University has to cancel exams demands Nara Lokesh

కరోనా థర్డ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న నేపధ్యంలో అన్ని రాష్ట్రాలు పరీక్షలు వాయిదా వేశాయని టీడీపీ నేత నారా లోకేశ్ తెలిపారు. కానీ మన రాష్ట్రంలో పరీక్షలను నిర్వహిస్తామని హెల్త్ యూనివర్సిటీ మొండి పట్టు పడుతోందని, ఇది మంచిది కాదని ఆయన అన్నారు. పరీక్షలు రాయాల్సిన 3 వేల మంది విద్యార్థుల్లో సుమారుగా 600 మంది కరోనా బారిన పడ్డారని చెప్పారు.  

వైద్య విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడకుండా ఈ నెల 28 నుంచి నిర్వహించ తలపెట్టిన ఎంబీబీఎస్ మొదటి ఏడాది పరీక్షలు, ఫిబ్రవరి 1 నుండి నిర్వహించాలనుకుంటున్న రెండవ ఏడాది పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.  విద్యార్థులు, తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకొని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు తక్షణమే పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాలని కోరారు.

More Telugu News