Chiranjeevi: చిరంజీవి సరసన మరోసారి త్రిష!

Trisha to pair with Chiranjeevi
  • వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం
  • చిరు సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్న త్రిష
  • 16 ఏళ్ల క్రితం చిరుతో కలిసి నటించిన త్రిష
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆచార్య' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. 'గాడ్ ఫాదర్', 'భోళా శంకర్' చిత్రాలు లైన్ లో ఉన్నాయి. దీంతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఓ సినిమా రాబోతోంది. ఈ చిత్రం కామెడీ ఎంటర్ టైనర్ గా రానున్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకు కథానాయికగా తొలుత శ్రుతిహాసన్ ను అనుకున్నప్పటికీ... తాజాగా త్రిషను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. చిరంజీవి సరసన త్రిష గతంలో కూడా నటించింది. 2006లో వచ్చిన 'స్టాలిన్' చిత్రంలో ఆమె మెరిసింది. ఆ తర్వాత మళ్లీ పదహారేళ్లకు చిరు సరసన ఆమె మరోసారి నటించనుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రానుంది.
Chiranjeevi
Trisha
Tollywood

More Telugu News