Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. బిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసిన జింక

Accident on Thirumala Ghat Road Deer giving birth to a baby while dead
  • తిరుమల ఏడో మైల్‌స్టోన్ వద్ద ఘటన
  • జింకను ఢీకొట్టిన బస్సు
  • జింకపిల్లను ఎస్వీ జూకు తరలించిన అధికారులు
తిరుమల ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ జింక చనిపోతూ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్తున్న బస్సు 7వ మైల్‌స్టోన్ సమీపంలో రోడ్డు దాటుతున్న జింకను ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. అప్పటికే నిండు గర్భంతో ఉన్న ఆ జింక చనిపోతూ పిల్లకు జన్మనిచ్చింది.

అది చూసిన భక్తుల మనసులు ద్రవించిపోయాయి. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, టీటీడీ అధికారులు జింకపిల్లను ఎస్వీ జూకు తరలించారు.
Tirumala
Tirupati
Deer
Road Accident

More Telugu News