Chandrababu: బుద్ధా వెంకన్న అరెస్ట్ కుట్రపూరితం: చంద్రబాబు

Chandrababu condemns Budda Venkanna arrest
  • బుద్ధా వెంకన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్  
  • కేసీనోపై ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అంటూ ఆగ్రహం 
  • పోలీసుల వైఖరి దుర్మార్గంగా ఉందని వ్యాఖ్య  
టీడీపీ అగ్రనేత బుద్ధా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. బుద్ధా అరెస్ట్ ను ఖండిస్తున్నట్టు తెలిపారు. బుద్ధా అరెస్ట్ కుట్రపూరితం అని, తమ నేతను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కొడాలి నాని కేసినోపై ప్రశ్నించిన తమ నేతలను అరెస్ట్ చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుడివాడలో ఏమీ జరగకుంటే ప్రభుత్వం, పోలీసులు ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. దాడి చేసినవారిని వదిలిపెట్టి నిలదీసిన వారిని అరెస్ట్ చేయడం హేయం అని వ్యాఖ్యానించారు. పోలీసుల వైఖరి దుర్మార్గంగా ఉందని, తప్పు చేసిన పోలీసులు విచారణ ఎదుర్కొనక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.
Chandrababu
Budda Venkanna
Arrest
Police
TDP

More Telugu News