CM Jagan: ఏపీలో కొత్త పథకం.. రేపు అగ్రవర్ణ మహిళల ఖాతాల్లోకి రూ.15 వేలు చొప్పున జమ చేయనున్న సీఎం జగన్!

  • 'వైఎస్సార్ ఈబీసీ నేస్తం' పథకం ప్రారంభం  
  • మూడేళ్లకు రూ.45 వేలు అందజేత
  • ఏటా రూ.15 వేల చొప్పున జమ 
  • 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు చేయూత
CM Jagan inaugurates EBC Nestam Scheme

బ్రాహ్మణ, క్షత్రియ, రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, వెలమ వంటి అగ్రవర్ణాల్లోని పేద మహిళలకు లబ్ది చేకూర్చే ఉద్దేశంతో సీఎం జగన్ ప్రభుత్వం ఏపీలో ఈబీసీ నేస్తం పథకానికి రూపకల్పన చేసింది. ఈ పథకాన్ని సీఎం జగన్ రేపు ప్రారంభించనున్నారు. 45 ఏళ్లకు పైబడి 60 ఏళ్ల లోపు వయసు వారికి ఈబీసీ పథకం ద్వారా ప్రయోజనం దక్కనుంది. వారికి మూడేళ్ల పాటు ఏటా రూ.15 వేలు చొప్పున మొత్తం రూ 45 వేలు అందించనున్నారు.

సీఎం జగన్ మంగళవారం నాడు క్యాంపు కార్యాలయం నుంచి ఒక్క బటన్ నొక్కడం ద్వారా నగదును ఆయా మహిళల ఖాతాలకు బదిలీ చేయనున్నారు. ఈ పథకం ద్వారా 3.92 లక్షల మంది అగ్ర వర్ణ పేద మహిళలు ప్రయోజనం పొందనున్నారు.

More Telugu News