Perni Nani: విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి దిగజారి ప్రవర్తించారు: ఏపీ మంత్రి పేర్ని నాని

Perni Nani slams foreign affairs minister of state
  • కడప జైలులో బీజేపీ నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డి
  • పరామర్శించిన విదేశాంగ సహాయమంత్రి మురళీధరన్
  • విమర్శనాస్త్రాలు సంధించిన పేర్ని నాని

కడప జైలులో ఉన్న కర్నూలు జిల్లా బీజేపీ నాయకుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయమంత్రి మురళీధరన్ నేడు పరామర్శించారు. ఆయన జైలుకు వెళ్లి శ్రీకాంత్ రెడ్డిని కలవడంపై ఏపీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ ముద్దాయిని పరామర్శించేందుకు కేంద్రమంత్రి జైలుకు వచ్చారని, ఓ కేంద్రమంత్రి ఇలా జైలుకు రావడం రాజకీయాలను దిగజార్చిందని విమర్శించారు. ఇది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు.

మత విద్వేషాలు రెచ్చగొట్టిన వ్యక్తికి కేంద్రమంత్రి పరామర్శ సరికాదని అన్నారు. రాష్ట్రాన్ని బీజేపీ నేతలు ఏంచేయాలనుకుంటున్నారు? అని మండిపడ్డారు. బీజేపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా చేసే ప్రయత్నాలు బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుంటే ఎన్ఐఏ, ఐబీ ఏంచేస్తున్నాయని పేర్ని నాని ప్రశ్నించారు. బీజేపీ బారి నుంచి రాష్ట్రాన్ని ఆ భగవంతుడే కాపాడాలని అన్నారు.

  • Loading...

More Telugu News