Raghu Rama Krishna Raju: 'నువ్వు పందెం కోడి కాదు ఫారం కోడి' అన్న విజయసాయి... 'నువ్వు పందెంకోడిగా రా... నీ ఈకలు పీకి పంపిస్తా' అంటూ కౌంటరిచ్చిన రఘురామకృష్ణరాజు

Raghurama replies Vijayasai Reddy tweet
  • కోడి పందాలు మా సంస్కృతి అంటూ సుప్రీంకోర్టుకెళ్లాడు 
  • టీడీపీ ట్యూన్లకు రికార్డింగ్ డాన్స్ వేసే డాన్సింగ్ రాజా అన్న విజయసాయి  
  • కోడికత్తిని అడ్డంపెట్టుకుని వచ్చారన్న రఘురామ
  • నువ్వు ఏ1 ట్యూన్స్ కి డాన్స్ చేస్తున్నావా? అంటూ సెటైర్  
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మధ్య ట్వీట్ల వార్ కొనసాగుతోంది. 'కోడి పందాలు మా సంస్కృతి అంటూ సుప్రీంకోర్టు వరకు వెళ్లాడు. అందరూ అతన్ని పందెం కోడి అనుకున్నారు. కానీ అతను ఫారం కోడి అని తేలిపోయింది. టీడీపీ ట్యూన్లకు రికార్డింగ్ డాన్స్ వేసే డాన్సింగ్ రాజా అతను. ఆ నర్సాపురం పంజరం చిలుక  ఢిల్లీలో కూర్చుని పలికేవన్నీ పచ్చ గ్యాంగ్ రాసిచ్చిన పలుకులే" అంటూ విజయసాయి ఎద్దేవా చేశారు.

దీనికి వెంటనే రఘురామ కూడా స్పందించారు. 'కోడి కత్తిని అడ్డంపెట్టుకుని వచ్చిన మీరు ఇంత కన్నా ఏమంటారులే. ఎలాగో నీకు రాజ్యసభ రెన్యువల్ లేదు కాబట్టి నువ్వు నా మీదకు పందెం కోడిగా రా. నీ ఈకలు పీకి పంపిస్తా! అవునుకానీ, నువ్వు ఏ1 ట్యూన్స్ కి డాన్స్ చేస్తున్నావా? లేక విశాఖలో ఇంకెవరైనా కడుతున్న ట్యూన్స్ కి డాన్స్ చేస్తున్నావా?' అంటూ రఘురామ దెప్పిపొడిచారు.
Raghu Rama Krishna Raju
Vijay Sai Reddy
YSRCP
Andhra Pradesh

More Telugu News