ఆఫ్ఘనిస్థాన్ లో ప్రకృతి విలయం... హిమపాతానికి 42 మంది బలి
- గత మూడు వారాలుగా కురుస్తున్న మంచు
- 15 ప్రావిన్స్ లో స్తంభించిన జనజీవనం
- ఇళ్లలోనే బందీలుగా ప్రజలు
- మంచుతో మూసుకుపోయిన రహదారులు
ఇటీవలే భూకంపాల ధాటికి ఆఫ్ఘనిస్థాన్ లో పలు ప్రాంతాల్లో ప్రాణనష్టం జరిగింది. ఇప్పుడు మంచు కూడా ఆఫ్ఘన్ల పాలిట మృత్యువుగా మారింది. ఈ మంచు వర్షం ధాటికి 2 వేలకు పైగా ఇళ్లు ధ్వంసం అయ్యాయని అధికారులు చెబుతున్నారు.