Mandali Buddaprasad: వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో.. బుద్ధా వెంకన్న ఇంటికి భారీగా చేరుకున్న పోలీసులు!

Huge number of police reached Budda Venkanna home to arrest him
  • ఈ ఉదయం కొడాలి నానికి వార్నింగ్ ఇచ్చిన బుద్ధా వెంకన్న
  • చంద్రబాబు ఇంటిని టచ్ చేస్తే శవమై వెళ్తావని వార్నింగ్
  • వెంకన్న ఇంటి వద్దకు చేరుకున్న 60 మంది పోలీసులు

టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంకన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ తీసుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసులు విజయవాడలోని ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు.  

 మంత్రి కొడాలి నానిపై బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. వైసీపీ నేతల ఫిర్యాదు మేర కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. చంద్రబాబు ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే ప్రాణం తీస్తామంటూ వెంకన్న ఈ ఉదయం హెచ్చరించారు. చంద్రబాబు ఇంటిని టచ్ చేస్తే శవమై వెళ్తావని వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే రా తేల్చుకుందామని అన్నారు.

ఇంత జరుగుతున్నా డీజీపీ స్పందించరా? అని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. పోలీసులు అక్కడకు చేరుకున్నారన్న సమాచారం అందుకున్న టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News