ఏపీలో వైయస్ షర్మిల పార్టీ పెడితే... ఆ పార్టీలో చేరే మొదటి వ్యక్తి ఈయనే: బుద్ధా వెంకన్న
- షర్మిల పార్టీలో చేరే తొలి వ్యక్తి కొడాలి నాని
- చంద్రబాబు ఇంటి వైపు ఎవరైనా వస్తే చావగొట్టి పంపిస్తాం
- డీజీపీ తీరు డైరెక్టర్ జనరల్ ఆఫ్ జగన్ పార్టీ అనే విధంగా ఉంది
ఏపీలో వైయస్ షర్మిల రాజకీయ పార్టీ పెడితే అందులో చేరే మొదటి వ్యక్తి కొడాలి నాని అని అన్నారు. జోగి రమేశ్ వచ్చినట్టు చంద్రబాబు ఇంటి వైపు ఎవరైనా వస్తే చావగొట్టి పంపిస్తామని చెప్పారు. డీజీపీ తీరు డైరెక్టర్ జనరల్ ఆఫ్ జగన్ పార్టీ అనే విధంగా ఉందని దుయ్యబట్టారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.