Vallabhaneni Vamsi: క్యాసినో నిర్వహించలేదు.. గతంలో మాదిరే శిబిరాలు మాత్రం కొనసాగాయి: గుడివాడ ఘటనపై వల్లభనేని వంశీ

  • నాని అనారోగ్యంతో ఉండడంతో స్నేహితులు శిబిరాలు నిర్వహించారు  
  • ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా కోడి పందాలు జరిగాయి 
  • స్వార్థ ప్రయోజనాల కోసమే టీడీపీ అలజడి రేపుతోందన్న వంశీ 
vamshi slams chandrababu

గుడివాడలో క్యాసినో నిర్వహించలేదని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. సంక్రాంతి నేపథ్యంలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా కోడి పందాలు, పేకాట శిబిరాలు కొనసాగాయని చెప్పారు. మంత్రి కొడాలి నాని అనారోగ్యంతో బాధపడ్డారని, దీంతో తన స్నేహితులు శిబిరం నిర్వహించిన మాట వాస్తవమేనని ఆయన తెలిపారు. తన స్నేహితుల గురించి కొడాలి నానికి తెలియదని చెప్పారు.

అది క్యాసినో కాదని ఆయన చెప్పుకొచ్చారు. టీడీపీ హయాంలో నిర్వహించిన శిబిరాలే ఇప్పుడు కూడా జరిగాయని తెలిపారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమే టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ పేరుతో అలజడి రేపుతోందని అన్నారు. అమ్మాయిలు చేసిన డ్యాన్సుల్లో అర్ధ నగ్న దృశ్యాలు లేవని ఆయన చెప్పారు. పోలీసుల విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని ఆయన తెలిపారు. టీడీపీ అధికారిక వెబ్ సైట్లలో కొడాలి నానిపై, తనపై పోస్టింగులు పెట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.

More Telugu News