Andhra Pradesh: ఉద్యోగుల జీతాలను తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉంది: ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Government has right to reduce Employees salaries says AP High Court
  • పీఆర్సీ అంశంపై ఏపీ హైకోర్టులో పిటిషన్
  • పీఆర్సీ వల్ల జీతం పెరిగిందా? తగ్గిందా? అని ప్రశ్నించిన హైకోర్టు
  • ఉద్యోగుల గ్రాస్ శాలరీ పెరిగిందన్న ఏజీ
ఏపీలో పీఆర్సీ అంశం వేడి పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పీఆర్సీపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగుల జీతాలను తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది.

హెచ్ఆర్ఏ విభజన చట్టం ప్రకారం జరగలేదంటూ హైకోర్టు దృష్టికి పిటిషనర్ తెచ్చారు. అయితే ఈ ఆరోపణతో హైకోర్టు ఏకీభవించలేదు. పీఆర్సీ వల్ల జీతం పెరిగిందా? తగ్గిందా? అనేది చెప్పాలని కోర్టు అడిగింది. మీకు ఎంత జీతం తగ్గిందో చెప్పాలని... అంకెల్లో ఈ లెక్కలు అందజేయాలని వ్యాఖ్యానించింది.

అసలు పూర్తి డేటా లేకుండా కోర్టుకు ఎలా వస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. పర్సెంటేజీని ఛాలెంజ్ చేసే హక్కు మీకు లేదని తెలిపింది. ఈ పిటిషన్ కు చట్టబద్ధత లేదని వ్యాఖ్యానించింది. మరోవైపు ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ తన వాదలను వినిపిస్తూ... ఉద్యోగుల గ్రాస్ శాలరీ పెరిగిందని కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించిన లెక్కలను అందించారు.
Andhra Pradesh
AP High Court
PRC
Government

More Telugu News