CPI Ramakrishna: జగన్ మౌనంగా ఉన్నారంటే.. విష సంస్కృతిని ప్రోత్సహించినట్టే కదా?: సీపీఐ రామకృష్ణ

CPI Ramakrishna fires on Jagan on Gudivada casino issue
  • గుడివాడ కేసినో ఘటనపై జగన్ సమాధానం చెప్పాలి
  • ఇప్పటి వరకు డీజీపీ ఏం చర్యలు తీసుకున్నారు?
  • కేసీనో నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
గుడివాడలో కేసినో రగడపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. కేసీనో ఘటనపై ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ మౌనంగా ఉన్నారంటే కేసినో వంటి విష సంస్కృతిని ప్రోత్సహించినట్టే కదా? అని ప్రశ్నించారు. గత నాలుగైదు రోజులుగా కేసినోపై రాష్ట్రంలో రచ్చ జరుగుతుంటే డీజీపీ ఏం చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు. కొడాలి నానిపై వచ్చిన కేసినో అభియోగాలపై ప్రభుత్వం ఏం సమాధానం చెపుతుందని అడిగారు. కేసినో నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
CPI Ramakrishna
Jagan
Kodali Nani
YSRCP
AP DGP
Casino
Gudivada

More Telugu News