Siddhu: అనిరుధ్ పాడిన 'పటాస్ పిల్లా' సాంగ్ రిలీజ్!

  • రొమాంటిక్ లవ్ స్టోరీగా 'డీజే టిల్లు
  • హీరోగా సిద్ధు జొన్నలగడ్డ
  • హీరోయిన్ గా నేహా శెట్టి పరిచయం
  • సంగీత దర్శకుడిగా శ్రీచరణ్ పాకాల
DJ Tillu Song Released

సిద్ధు జొన్నలగడ్డ .. నేహాశెట్టి జంటగా 'డీజే టిల్లు' సినిమా రూపొందింది. సితార - ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి 'పట్టాసు పిల్లా  .. పట్టాసు పిల్లా' అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. హీరో హీరోయిన్లపై ఈ పాటను చిత్రీకరించారు.

లవ్ .. రొమాన్స్ ను ప్రధానంగా చేసుకుని సాగే పాట ఇది. శ్రీచరణ్ పాకాల స్వరపరిచిన ఈ పాటకి కిట్టు విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించగా, సంగీత దర్శకుడు అనిరుధ్ ఆలపించాడు. సంగీత సాహిత్యాలు ఓ మాదిరిగా అనిపిస్తాయి. రొమాంటిక్ సీన్స్ కూడా రొటీన్ గానే కనిపిస్తాయి.

'ఆరెంజ్' .. 'గుంటూరు  టాకీస్' .. 'కల్కి' సినిమాల్లో ముఖ్యమైన పాత్రలను పోషించిన సిద్ధు, ఈ సినిమాలో రొమాంటిక్ హీరోగా మార్కులు కొట్టాలనే పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఆయన కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి. బ్రహ్మాజీ .. ప్రగతి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

More Telugu News