Venkaiah Naidu: వెంకయ్యనాయుడుగారు త్వరగా కోలుకోవాలి: చిరంజీవి

get well soon says chiru
  • క‌రోనా బారిన ప‌డ్డ వెంక‌య్య నాయుడు
  • ప్ర‌స్తుతం ఐసోలేష‌న్‌లో చికిత్స‌
  • హైద‌రాబాద్‌లో ఉన్న ఉప రాష్ట్ర‌ప‌తి
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా బారిన పడిన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం వెంకయ్య నాయుడు హైదరాబాద్ లో ఉన్నారు. వారం రోజుల పాటు ఐసోలేషన్ లో ఉంటానని ఆయన ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప‌లువురు ప్ర‌ముఖులు ఆకాంక్షిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ విషయంపై ట్వీట్ చేశారు.

'ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు గారు క‌రోనా నుంచి వేగంగా కోలుకోవాల‌ని కోరుకుంటున్నాను. త్వ‌ర‌లోనే మీరు కోలుకోవాలి స‌ర్' అని చిరంజీవి ట్వీట్ చేశారు. కాగా, త‌న‌ను ఇటీవ‌ల క‌లిసిన వారంద‌రూ క‌రోనా పరీక్ష‌లు చేయించుకోవాల‌ని వెంక‌య్య నాయుడు కోరారు.
Venkaiah Naidu
Chiranjeevi
Tollywood

More Telugu News