దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌

24-01-2022 Mon 09:59
  • నిన్న‌ 3,06,064 కేసులు
  • 439 మంది మృతి
  • 22,49,335 యాక్టివ్ కేసులు
  • రోజువారీ పాజిటివిటీ రేటు 20.75 శాతం
corona bulletin in inida
దేశంలో క‌రోనా కేసుల విజృంభ‌ణ కొన‌సాగుతోంది. నిన్న దేశంలో 3,06,064 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. మొన్న‌టి కంటే నిన్న 27,469 కేసులు త‌క్కువ‌గా న‌మోద‌య్యాయి. నిన్న క‌రోనాతో 439 మంది ప్రాణాలు కోల్పోయారు.

క‌రోనా నుంచి కొత్త‌గా 2,43,495 మంది కోలుకున్నారు. కాగా, ప్ర‌స్తుతం హోం క్వారంటైన్లు, ఆసుప‌త్రుల్లో 22,49,335 మందికి చికిత్స అందుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 20.75 శాతంగా ఉంద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది.