YSRCP: ఇద్దరు వైసీపీ ఎంపీలకు కరోనా పాజిటివ్

Two YSRCP MPs tests positive for Corona
  • కరోనా బారిన పడుతున్న పలువురు నేతలు
  • తాజాగా వంగా గీత, మార్గాని భరత్ లకు కరోనా
  • హోం ఐసొలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్న వైనం
కరోనా బారిన పడుతున్న నేతల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే ఏపీ మంత్రులు కొడాలి నాని, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే అంబటి రాంబాబు వంటి నాయకులు కరోనా బారిన పడ్డారు. తాజాగా అదే పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. కాకినాడ ఎంపీ వంగా గీత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కు కరోనా సోకింది. వంగా గీత పీఏ, ఆమె గన్ మెన్ కు కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం వీరంతా హోం ఐసొలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.

మరోవైపు దేశంలో మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఒమిక్రాన్ రాకతో మళ్లీ పుంజుకున్నాయి. పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ఈ క్రమంలో సామాన్యులతో పాటు అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు కూడా పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
YSRCP
MPs
Margani Bharat
Vanga Geetha

More Telugu News