Subbarao Gupta: మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు ఇలాగే కొనసాగితే కార్యకర్తలు తిరగబడతారు: వైసీపీ నాయకుడు సుబ్బారావు గుప్తా

Ycp leader subbarao Gupta once again fires on kodali nani
  • కొడాలి నాని వాడుతున్న భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉంది
  • నానిపై జగన్ చర్యలు తీసుకోకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా
  • క్యాసినో నిర్వహించకుంటే టీడీపీ నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారు?
మంత్రి కొడాలి నాని వాడుతున్న భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉంటోందని, అది అలాగే కొనసాగితే కార్యకర్తలే తిరగబడతారని వైసీపీ నాయకుడు సోమిశెట్టి సుబ్బారావు గుప్తా అన్నారు. ఒంగోలు ప్రెస్ క్లబ్‌లో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి నాని వాడుతున్న భాష సరిగా లేదన్నారు. మంత్రి వాడుతున్న భాషకు కొందరు సంతోషిస్తున్నప్పటికీ ఎక్కువమంది మాత్రం చీదరించుకుంటున్నారని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో పార్టీకి తీరని నష్టం జరుగుతుందన్నారు.

మంత్రి నానిపై ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకోవాలని, లేదంటే వచ్చే ఎన్నికల్లో తాను గుడివాడ నుంచి బరిలోకి దిగుతానని తెలిపారు. ఒంగోలులో తన ఇంటిపై దాడిచేసిన వ్యక్తులపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  మంత్రి కుమారుడు ప్రణీత్‌రెడ్డి ఒంగోలులో మాఫియా నడుపుతుంటే బాలినేని మాత్రం ఏమీ తెలియనట్టు నటిస్తున్నారని అన్నారు. గుడివాడలో క్యాసినో నిర్వహించారన్న టీడీపీ ఆరోపణల్లో నిజం లేకుంటే ఆ పార్టీ నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు.
Subbarao Gupta
YSRCP
Chandrababu
Kodali Nani

More Telugu News