పరాజయం పరిపూర్ణం... చివరి వన్డేలోనూ ఓడిన టీమిండియా

23-01-2022 Sun 22:29
  • 4 వికెట్ల తేడాతో భారత్ ఓటమి
  • 288 పరుగుల లక్ష్యఛేదనలో 283 ఆలౌట్
  • కోహ్లీ, ధావన్, చహర్ అర్ధసెంచరీలు
  • చివరి వరకు పోరాడిన భారత్
Team India lost final ODI
దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా ఒక్క విజయం లేకుండా ముగించింది. కేప్ టౌన్ లో జరిగిన చివరి వన్డేలోనూ టీమిండియాకు ఓటమి తప్పలేదు. 288 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి వరకు పోరాడినా, 4 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. 49.2 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ 65, శిఖర్ ధావన్ 61, దీపక్ చహర్ 54, సూర్యకుమార్ యాదవ్ 39, శ్రేయాస్ అయ్యర్ 26 పరుగులు చేశారు.

అయితే చివరి ఓవర్లో 6 పరుగులు చేయాల్సి ఉండగా, వికెట్లు కోల్పోవడంతో భారత్ ఓడింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3, ఫెహ్లుక్వాయో 3, ప్రిటోరియస్ 2, మగాలా 1, కేశవ్ మహరాజ్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ ను 3-0తో ముగించింది.