తమ కుమార్తె వామికను మొట్టమొదటిసారి అందరికీ చూపించిన అనుష్క

23-01-2022 Sun 21:52
  • కేప్ టౌన్ లో కోహ్లీ అర్ధసెంచరీ
  • అభినందించిన అనుష్క
  • అనుష్క చంకలో వామిక
  • కెమెరాలకు చిక్కిన వైనం
Anushka shows their daughter Vamika for the first time
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల ముద్దుల తనయ వామిక ఇన్నాళ్లకు అందరికీ దర్శనమిచ్చింది. ఇప్పటివరకు ఆ చిన్నారిని మీడియాకు చూపించకుండా కోహ్లీ, అనుష్క జాగ్రత్త పడ్డారు. గతంలో అనేక పర్యాయాలు కోహ్లీ దంపతులు వామికను ఫొటోలు తీయొద్దని మీడియాకు స్పష్టం చేశాయి. అయితే, కేప్ టౌన్ లో దక్షిణాఫ్రికాతో టీమిండియా చివరి వన్డే సందర్భంగా అనుష్క... వామికను ఎత్తుకుని కనిపించింది.

ఈ మ్యాచ్ లో కోహ్లీ అర్ధసెంచరీ పూర్తిచేసుకోగా, కెమెరాలు ఒక్కసారిగా అనుష్కవైపు తిరిగాయి. దాంతో ఆమె చంకలో ఉన్న వామికను కూడా కెమెరాలు ఫ్రేమ్ లో బంధించాయి. కోహ్లీ, అనుష్క 2017లో పెళ్లి చేసుకోగా, మూడేళ్ల తర్వాత వామిక జన్మించింది. అప్పటినుంచి ఆ చిన్నారి అందరికీ దర్శనమివ్వడం ఇదే ప్రథమం.