కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాను: నారా లోకేశ్

23-01-2022 Sun 21:36
  • ఇటీవల కరోనా బారినపడిన లోకేశ్
  • మీ అభిమానమే నా ఆరోగ్యం అంటూ ట్వీట్
  • సదా మీ ప్రేమకు బానిసను అంటూ ఉద్ఘాటన
Nara Lokesh fully recovered from Corona
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఇటీవల కరోనా బారినపడడం తెలిసిందే. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నానని లోకేశ్ తాజాగా ట్విట్టర్ లో వెల్లడించారు. మీ అందరి పూజలు, ప్రార్థనలు, ఆకాంక్షలు, వైద్యుల సూచనల ఫలితంగా తాను కొవిడ్ నుంచి పూర్తిగా బయటపడ్డాను అని వెల్లడించారు. "మీ అభిమానమే నా ఆరోగ్యం, మీ ఆదరణే నాకు బలం. సదా మీ ప్రేమకు నేను బానిసను" అని భావోద్వేగభరితంగా వ్యాఖ్యానించారు.

అంతేకాదు, తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నా పుట్టినరోజు సందర్భంగా జనహితమైన కార్యక్రమాలు నిర్వహించిన మీ సేవాగుణానికి నా హ్యాట్సాఫ్ అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.