ముగిసిన పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సమావేశం

23-01-2022 Sun 20:11
  • విజయవాడలో ఉద్యోగ సంఘాల నేతల భేటీ
  • పీఆర్సీ, ఇతర అంశాలపై చర్చ
  • ప్రభుత్వంతో చర్చలకు వెళ్లరాదని నిర్ణయం
  • చర్చలకు మరోసారి ఆహ్వానించిన ప్రభుత్వం
Employees unions meeting concludes
ఐదు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ఉద్యోగ సంఘాల నేతలు వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. రేపు చర్చలకు రాబోవడంలేదని ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. పీఆర్సీ జీవోలు రద్దు చేసినప్పుడే చర్చలకు వస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.

అయితే, శశిభూషణ్ కుమార్ ఉద్యోగ సంఘాలు రేపు మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాలంటూ మరోసారి ఆహ్వానించారు. చర్చల్లో మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, సీఎస్ సమీర్ శర్మ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొంటారని వివరించారు.