మూడో వన్డేలో టీమిండియా విజయలక్ష్యం 288 రన్స్

23-01-2022 Sun 18:15
  • కేప్ టౌన్ లో టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా
  • టాస్ గెలిచిన టీమిండియా
  • 49.5 ఓవర్లలో 287 పరుగులు చేసిన సఫారీలు
  • డికాక్ సెంచరీ
  • ప్రసిద్ధ్ కృష్ణకు మూడు వికెట్లు
South Africa set target to Team India
టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్ టౌన్ లో చివరి వన్డే జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49.5 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌటైంది. సఫారీ ఇన్నింగ్స్ లో ఓపెనర్ క్వింటన్ డికాక్ ఆటే హైలైట్. డికాక్ సెంచరీ సాధించాడు. మొత్తం 130 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతివాటం ఆటగాడు 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 124 పరుగులు చేశాడు.

మిడిలార్డర్ లో రాస్సీ వాన్ డర్ డసెన్ 52, డేవిడ్ మిల్లర్ 39 పరుగులు సాధించారు. డ్వేన్ ప్రిటోరియస్ 20 పరుగులు నమోదు చేశాడు. టీమిండియా బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు, దీపక్ చహర్ 2, జస్ప్రీత్ బుమ్రా 2, చహల్ 1 వికెట్ తీశారు.