Varla Ramaiah: గుడివాడ కేసినోలో చీర్ గాళ్స్... ప్రయాణ వివరాలు వెల్లడించిన వర్ల రామయ్య

Varla Ramaiah reveals travel history of cheer girls
  • మరింత వేడెక్కిన గుడివాడ కేసినో వ్యవహారం
  • చీర్ గాళ్స్ ఇండిగో విమానంలో వచ్చారన్న వర్ల
  • ఉత్తరాది మహిళలు గుడివాడ ఎందుకు వచ్చారన్న టీడీపీ నేత
గుడివాడలో ఇటీవల కేసినో నిర్వహించారంటూ టీడీపీ నేతలు చేస్తున్న పోరాటం మరింత ఉద్ధృతమైంది. ఈ కేసినోలో చీర్ గాళ్స్ కూడా ఉన్నారంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపిస్తున్నారు. ఈ మేరకు, కేసినోలో పాల్గొన్న చీర్ గాళ్స్ ప్రయాణ వివరాలను ఆయన బహిర్గతం చేశారు.

మొత్తం 13 మంది చీర్ గాళ్స్ ఇండిగో విమానం ద్వారా ప్రయాణం చేశారని వెల్లడించారు. గన్నవరం-బెంగళూరు, బెంగళూరు-గోవా, గోవా-విజయవాడ ప్రయాణికుల వివరాలను వర్ల రామయ్య మీడియాకు వివరించారు. గోవా నుంచి విజయవాడ వచ్చిన వారి వివరాలు పోలీసులు సేకరించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన మహిళలు గుడివాడ ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. కేసినో నిర్వహణకు సంబంధించి సాక్ష్యాలు ఉన్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని నిలదీశారు.

అటు, కేసినోలో పాల్గొనేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు వసూలు చేశారని, ఈ ప్యాకేజీలో భాగంగా లాడ్జిలో వసతి, ట్రాన్స్ పోర్టు, ఎంట్రీ ఫీజు అన్నీ ఉచితమని వర్ల రామయ్య వివరించారు.
Varla Ramaiah
Cheer Girls
Casino
Gudivada
Kodali Nani
TDP

More Telugu News