Venkaiah Naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు మరోసారి కరోనా

Vice President of India Venkaiah Naidu tested corona positive again
  • భారత్ లో భారీగా కరోనా వ్యాప్తి
  • ఈ ఉదయం వెంకయ్యనాయుడుకు కరోనా టెస్టులు
  • పాజిటివ్ గా నిర్ధారణ
  • వారం రోజుల పాటు ఐసోలేషన్
  • 2020లోనూ కరోనా బారినపడిన వెంకయ్య
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరోసారి కరోనా బారిన పడ్డారు. గతంలో ఓసారి కరోనా నుంచి కోలుకున్న ఆయనకు తాజాగా రెండోసారి కరోనా సోకింది. ఇవాళ నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో వైద్యుల సూచన మేరకు ఆయన హైదరాబాదులోని తన నివాసంలో వారం రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండనున్నారు.

కాగా, గత కొన్నిరోజులుగా తనను కలిసిన వాళ్లు తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఐసోలేషన్ లో ఉండాలని వెంకయ్యనాయుడు సూచించారు. వెంకయ్యనాయుడు 2020 సెప్టెంబరులోనూ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే.
Venkaiah Naidu
Corona Virus
Positive
Vice President
India

More Telugu News