దేశంలోనే పొడవైన వ్యక్తి ధర్మేంద్ర ప్రతాప్ సింగ్.. రాజకీయ నేతగా అవతారం

23-01-2022 Sun 14:24
  • సమాజ్ వాదీ పార్టీలో చేరిక
  • ఆయన ఎత్తు 8 అడుగుల ఒక అంగుళం
  • ప్రపంచ రికార్డు కంటే 11 సెంటీమీటర్లు తక్కువ
ndias Tallest Man Dharmendra Pratap Singh Joins Samajwadi Party
దేశంలోనే అత్యంత పొడవైన వ్యక్తిగా పేర్కొంటున్న ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ సమాజ్ వాదీ పార్టీలో చేరారు. తద్వారా రాజకీయ నేతగా అవతారం ఎత్తారు. యూపీకి చెందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ ఎత్తు 8 అడుగుల ఒక అంగుళం. 2.4 మీటర్లు. ప్రపంచ రికార్డు కంటే 11 సెంటీమీటర్లు తక్కువ.

సమాజ్ వాదీ పార్టీ విధానాలు, అఖిలేశ్ యాదవ్ నాయకత్వం నచ్చి ప్రతాప్ సింగ్ ఎస్పీలో చేరినట్టు ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి ప్రకటించారు. ఆయన రాకతో పార్టీ మరింత బలం పుంజుకుంటుందన్నారు.

చాలా పొడవు ఉండడంతో తాను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్టు ఈ సందర్భంగా ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. పొడవు ఎక్కువ ఉండడం వల్ల ఎవరూ ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని, వివాహం చేసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదని చెప్పారు. అయితే, ఈ పొడవు కారణంగా తాను సెలబ్రిటీ అయిపోయినట్టు.. ప్రజలు తనతో ఫొటో తీసుకునేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తారని వెల్లడించారు.