Priyanka Gandhi: కాంగ్రెస్ ఓట్లను చీల్చే పార్టీ.. బీఎస్పీ అధినేత్రి మాయావతి విసుర్లు

  • ఆ పార్టీ సీఎం అభ్యర్థి వేగంగా ప్లేటు మారుస్తారు
  • కాంగ్రెస్ కు ఓటు వేసి దుర్వినియోగిం చేసుకోవద్దు
  • ప్రజలకు మాయావతి సూచన
Mayawati fired on Priyanka Gandhi Vadra Chief Minister Teaser

చాలా కాలం పాటు మౌనంగా, అజ్ఞాతంలో ఉండిపోయిన బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రజల ముందుకు వచ్చారు. యూపీ కాంగ్రెస్ చీఫ్, సీఎం అభ్యర్థినిగా ప్రచారం చేసుకుంటున్న ప్రియాంక గాంధీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. కాంగ్రెస్ కేవలం బీజేపీయేతర ఓట్లను చీల్చడానికే తప్ప, ఆ పార్టీతో వచ్చే ప్రయోజనం ఏమీ లేదని విమర్శించారు.

‘‘యూపీ అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ పార్టీ సీఎం అభ్యర్థి గంటల వ్యవధిలోనే తన విధానాన్ని మార్చుకుంటారు. అటువంటి సందర్భంలో ప్రజలు తమ ఓటును కాంగ్రెస్ పార్టీకి వేసి దుర్వినియోగం చేసుకోవద్దు’’అని మాయావతి పేర్కొన్నారు.

యూపీ ప్రజల దృష్టిలో కాంగ్రెస్.. ఓట్లను కట్ చేసే (చీల్చే) పార్టీగా మాయావతి అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున తానే సీఎం అభ్యర్థినంటూ శనివారం ప్రియాంక గాంధీ  కలకలం రేపడం తెలిసిందే. ఆ తర్వాత కొద్ది సమయానికే పొరపాటుగా అన్నానని, అసలు ఎన్నికల్లో తాను పోటీ చేస్తానో? లేదోనని ఆమె చెప్పడం తాజా విమర్శలకు కారణంగా చెప్పుకోవాలి. ఈ విడత ఎన్నికల్లో మాయావతి పోటీకి దూరంగా ఉండడం తెలిసిందే. అయినా సరే పార్టీ విజయం కోసం ఆమె ఆలస్యంగా అయినా తన ప్రయత్నాలు మొదలు పెట్టారు.

More Telugu News