ఆ నాటకంపై నిషేధాన్ని ఎత్తేయాలి: నిర‌స‌న‌లో పాల్గొన్న 'జబర్దస్త్' నటుడు అప్పారావు

23-01-2022 Sun 13:15
  • చింతామ‌ణి నాట‌కంపై నిషేధం స‌రికాదు
  • ఆ నాట‌కానికి గొప్ప చ‌రిత్ర ఉంది
  • 1920లో ఆ నాట‌కాన్ని కాళ్ల‌కూరి నారాయణరావు రాశారు
  • కళాకారులను, కళలను ప్రోత్సహించాలి
apparao protest against ap govt decision
చింతామణి నాటకంపై నిషేధం విధిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. దీనిపై ప‌లువురు కళాకారులు, తెలుగు భాషా ప్రేమికులు విశాఖలోని మద్దిలపాలెం జంక్షన్‌లో తెలుగు తల్లి విగ్రహం వద్ద నిరసనకు దిగారు. ఇందులో జబర్దస్త్ నటుడు అప్పారావు కూడా పాల్గొని ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు.

ఆ నాటకంపై నిషేధాన్ని వెంటనే ఎత్తేయాల‌ని డిమాండ్ చేశారు. ఆ నాట‌కానికి గొప్ప చ‌రిత్ర ఉంద‌ని, 1920లో ఆ నాట‌కాన్ని మహాకవి కాళ్ల‌కూరి నారాయణరావు రాశారని అప్పారావు చెప్పారు. రాష్ట్ర‌ ప్రభుత్వం ఇప్పుడు ఆ నాట‌కంపై నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయం స‌రికాద‌ని చెప్పారు. కళాకారులను, కళలను ప్రోత్సహించాల‌ని, చింతామ‌ణి నాట‌కంపై నిషేధాన్ని ఎత్తేయాల‌ని ఆయ‌న కోరారు.