ప్ర‌భాస్‌తో సినిమాపై ద‌ర్శ‌కుడు మారుతి స్పంద‌న‌

23-01-2022 Sun 13:03
  • డీవీవీ దానయ్య నిర్మాణంలో ప్రభాస్‌ సినిమా అంటూ వార్త‌లు
  • దానికి మారుతి ద‌ర్శ‌క‌త్వమ‌ని ఊహాగానాలు
  • ప‌లు ర‌కాల ప్ర‌చారం జ‌రుగుతోంద‌న్న మారుతి
  • సమయమే అన్నింటినీ బయటపెడుతుందని వ్యాఖ్య‌
  • అప్పటి వరకూ వేచి ఉండాల‌ని సూచ‌న‌
maruti tweet about movie with prabhas
యంగ్ రెబ‌ల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా మారుతి ఓ సినిమా రూపొందించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తోన్న విషయం తెలిసిందే. ప్రభాస్ చేతిలో ఇప్ప‌టికే అనేక సినిమాలు ఉన్నాయి. అయితే డీవీవీ దానయ్య నిర్మాణంలో ప్రభాస్ ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇటీవల డీవీవీని మారుతి క‌లిసి ఓ క‌థ చెప్పార‌ని, ఇందులో హీరోగా ప్ర‌భాస్ న‌టిస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ ప్ర‌చారంపై మారుతి స్పందించారు.

త‌న‌ భవిష్యత్తు ప్రాజక్టులు, వాటి టైటిల్స్‌, ఇతర అంశాల‌పై ప‌లు ర‌కాల ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని చెప్పారు. అయితే, సమయమే అన్నింటినీ బయటపెడుతుందని, అప్పటి వరకూ వేచి ఉండాల‌ని ఆయ‌న తెలిపారు. త‌న‌ను దర్శకుడిగా సపోర్ట్‌ చేస్తోన్న వారందరికీ ధన్యవాదాలు చెబుతున్న‌ట్లు పేర్కొన్నారు. ప్ర‌స్తుతం కరోనా తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోంద‌ని, అంద‌రూ జాగ్రత్తగా ఉండాల‌ని సూచించారు.