యూపీలో కూటమిని ప్రకటించిన ఒవైసీ.. గెలిస్తే ఇద్దరు ముఖ్యమంత్రులు

23-01-2022 Sun 08:25
  • జన్ అధికార్ పార్టీ, బీఏఎంసీఈఎఫ్‌లతో కూటమి ఏర్పాటు
  • ‘భాగీదారి పరివర్తన్ మోర్చా’గా పేరు
  • గెలిస్తే ఒక దళిత ముఖ్యమంత్రి, ఒక ఓబీసీ ముఖ్యమంత్రి
Asaduddin Owaisi Announces New Front for up elections
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిస్తే  ఐదేళ్ల కాలంలో ఇద్దరు వ్యక్తులు సీఎంలుగా పనిచేస్తారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. యూపీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఇటీవల ప్రకటించిన ఒవైసీ.. తాజాగా కొత్త కూటమిని ప్రకటించారు. జన్ అధికార్ పార్టీ, బీఏఎంసీఈఎఫ్‌లతో కలిసి ‘భాగీదారీ పరివర్తన్ మోర్చా’ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

ప్రజలు కనుక తమ కూటమిని గెలిపిస్తే ఐదు సంవత్సరాల కాలంలో ఓబీసీ నుంచి ఒకరు, దళితుల నుంచి ఒకరు ముఖ్యమంత్రులుగా ఉంటారని వివరించారు. అలాగే, డిప్యూటీ సీఎంలుగా ముగ్గురు ఉంటారని పేర్కొన్నారు. వారిలో ఒకరిని ముస్లిం వర్గం నుంచి ఎంపిక చేస్తామన్నారు. భాగీదారి పరివర్తన్ మోర్చాకు జన్ అధికార్ పార్టీ చీఫ్ బాబు సింగ్ కుశ్వాహా నేతృత్వం వహిస్తారు. గత మాయావతి ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు.