తెలంగాణవైపు తక్కువ ఎత్తులో గాలులు.. నేడు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

23-01-2022 Sun 08:07
  • దక్షిణ భారతదేశం నుంచి పూర్తిగా వెనక్కి వెళ్లిన ఈశాన్య రుతుపవనాలు
  • రాష్ట్రంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
  • నిన్న రెడ్డిపల్లిలో అత్యల్పంగా 10.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
Rains forecast today In telangana
తెలంగాణలో ఆదివారం అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ, దక్షిణ భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణవైపు  గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో నేడు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

అలాగే, దక్షిణ భారతదేశం నుంచి ఈశాన్య రుతుపవనాలు పూర్తిగా వెనక్కి వెళ్లిపోయాయని తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు బాగా పడిపోవడంతో చలి తీవ్రత పెరిగిందని, నిన్న తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో కనిష్ఠంగా 10.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొంది. అలాగే, కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురుస్తోందని, గాలిలో తేమ సాధారణంగా 17 శాతం ఎక్కువగా ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.