నాని సినిమాలో మలయాళ యువ నటుడు!

22-01-2022 Sat 18:53
  • 'శ్యామ్ సింగ రాయ్'తో దొరికిన హిట్
  • ముగింపు దశలో 'అంటే సుందరానికీ'
  • సెట్స్ పైనే ఉన్న 'దసరా'
  • కథానాయికగా కీర్తి సురేశ్  
Dasara movie upadate
నాని హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్' మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత సినిమాగా ఆయన 'అంటే .. సుందరానికీ' చేస్తున్నాడు. ఈ సినిమాతో కథానాయికగా నజ్రియా నజీమ్ తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఆ తరువాత సినిమాగా నాని 'దసరా'ను లైన్లో పెట్టేశాడు .. .. ఆల్రెడీ షూటింగ్ మొదలైపోయింది.

సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. తెలంగాణలోని ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలోనే మాట్లాడతాడట. అందుకోసం ఆయన ట్యూటర్ ను పెట్టుకుని ఆ యాసను ప్రాక్టీస్ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఆయన పాత్ర నెగెటివ్ షేడ్స్ తో ఉండనుందని అంటున్నారు.

ఇక ఈ సినిమాను మలయాళంలో కూడా విడుదల చేసే ఆలోచన ఉందని అంటున్నారు. అందువల్లనే మలయాళానికి చెందిన యువ నటుడు రోషన్ మాథ్యూని ఒక కీలకమైన పాత్ర కోసం ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, సాయికుమార్ .. సముద్రఖని ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.