భారత్ లోనే ఐపీఎల్-2022... బీసీసీఐ ధీమా

22-01-2022 Sat 18:43
  • వర్చువల్ సమావేశం నిర్వహించిన బీసీసీఐ
  • హాజరైన ఐపీఎల్ పాలకమండలి, ఫ్రాంచైజీల యజమానులు
  • ఐపీఎల్ వేదికపై సమీక్ష
  • మార్చి 27 నుంచి భారత్ లో నిర్వహించేందుకు నిర్ణయం!
IPL likely in Indian soil from March
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుండడంతో భారత్ లో ఐపీఎల్-2022 సీజన్ నిర్వహణపై అనుమాన మేఘాలు అలముకున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ నేడు అన్ని ఫ్రాంచైజీలు, ఐపీఎల్ పాలకమండలి సభ్యులతో వర్చువల్ సమావేశం నిర్వహించి పరిస్థితి సమీక్షించింది. ఐపీఎల్ తాజా సీజన్ ఎక్కడ నిర్వహించాలన్న దానిపై చర్చించింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న మీదట భారత్ లోనే ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఐపీఎల్ పాలకమండలి చైర్మన్ బ్రజేశ్ పటేల్ మాట్లాడుతూ, ఐపీఎల్-2022 సీజన్ సొంతగడ్డపైనే మార్చి 27న ప్రారంభం అవుతుందని సూచనప్రాయంగా వెల్లడించారు. నేటి సమావేశానికి హాజరైన ఓ అధికారి స్పందిస్తూ, ముంబయి, పూణే నగరాల్లో పలు మైదానాలు ఉన్నందున, కొత్త సీజన్ లో పోటీలు ఆ రెండు నగరాల్లో నిర్వహించే వీలుందని తెలిపారు.