వచ్చే సంక్రాంతి బరిలో మహేశ్ - త్రివిక్రమ్ మూవీ!

22-01-2022 Sat 18:19
  • షూటింగు దశలో 'సర్కారువారి పాట'
  • ఏప్రిల్లో త్రివిక్రమ్ సినిమా మొదలు
  • సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచన
  • కథానాయికగా పూజ హెగ్డే  
Trivikram and Mahesh Babu movie update
త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను మహేశ్ బాబుతో చేయనున్నాడు. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసేసి త్రివిక్రమ్ రెడీగా ఉన్నాడు. అసలు ఈ పాటికే ఈ సినిమా షూటింగు మొదలుకావలసింది. కానీ కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. మహేశ్ మోకాలు సర్జరీ కూడా మరింత ఆలస్యానికి కారణమైంది.

ఇక ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనుందనే విషయంపై అంతా ఆసక్తిగా ఉన్నారు. ఏప్రిల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు. ముందుగా మహేశ్ బాబు 'సర్కారువారి పాట' బ్యాలెన్స్ షూటింగును పూర్తి చేసి, ఆ తరువాతనే త్రివిక్రమ్ ప్రాజెక్టుపైకి రానున్నాడు.

ఈ సినిమా ఎంతలేదన్నా ఒక ఎనిమిది నెలల సమయం తీసుకుంటుంది. అందువలన సంక్రాంతి బరిలోనే ఈ సినిమాను నిలపాలనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నాడని అంటున్నారు. ఆ విధంగానే ప్లానింగ్ జరిగిపోయిందని చెబుతున్నారు. పూజ హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా గోపీచంద్ పేరు వినిపిస్తోంది.