ఆ అమ్మాయి గురించి మీరు టీజర్లో చూడాలి!

22-01-2022 Sat 17:49
  • ఇంద్రగంటితో సుధీర్ బాబు
  • ఇద్దరి కాంబోలో మూడో సినిమా
  • కంటి డాక్టర్ పాత్రలో కృతి శెట్టి
  • త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటన
Aa Ammayi Gurinchi Meeku Cheppali Teaser Released
మొదటి నుంచి కూడా సుధీర్ బాబు తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను .. తనకి నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా ముస్తాబవుతోంది. ఇంద్రగంటి మోహనకృష్ణతో సుధీర్ బాబు చేస్తున్న మూడో సినిమా ఇది.
 
తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. సుధీర్ బాబు ఇందులో సినిమా డైరెక్టర్ గా .. కంటి డాక్టర్ గా కృతి శెట్టి కనిపించనున్నారనే విషయం ఈ టీజర్ వలన తెలుస్తోంది. ఆమెను తన సినిమాలో హీరోయిన్ గా ఒప్పించడానికి ఆయన తాపత్రయ పడటం ఈ టీజర్ లో చూపించారు.

ఆయన అదే పనిగా తన చుట్టూ తిరుగుతూ ఉండటంతో, ఆయన సినిమాలో చేయడానికి ఆమె అంగీకరిస్తుంది. అయితే అందుకు ఒక షరతు పెడుతుంది. ఆ షరతు ఏమిటనే సస్పెన్స్ ను రేకెత్తిస్తూ కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ - మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.