బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ కు పాకిన అల్లు అర్జున్ 'పుష్ప' క్రేజ్... వీడియో ఇదిగో!

22-01-2022 Sat 17:26
  • అల్లు అర్జున్ హీరోగా 'పుష్ప'
  • విశేష ప్రజాదరణ పొందిన 'తగ్గేదే లే' డైలాగ్
  • వికెట్ తీసి బన్నీలా సెలబ్రేట్ చేసుకున్న నజ్ముల్
Pushpa craze in Bangladesh Premiere league
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'పుష్ప' చిత్రం దేశ సరిహద్దులు దాటి క్రేజ్ సంపాదించుకుంటోంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బన్నీ చెప్పిన 'తగ్గేదే లే' డైలాగు వీర లెవల్లో పాప్యులర్ అయింది. క్రికెటర్లు సైతం బన్నీలా 'తగ్గేదే లే' అంటూ అలరిస్తున్నారు.

తాజాగా, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) పోటీల్లో సిల్హెట్ సన్ రైజర్స్ టీమ్ కు చెందిన నజ్ముల్ హుస్సేన్ అపు వికెట్ తీయగానే, అల్లు అర్జున్ లా 'తగ్గేదే లే' అంటూ గడ్డం కింద నుంచి చేయి పోనిచ్చి సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఇప్పటివరకు డేవిడ్ వార్నర్, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు తగ్గేదే లే అంటూ ప్రత్యేకంగా వీడియోలు రూపొందించారు. అయితే, మైదానంలో బన్నీలా హావభావాలు ప్రదర్శించింది మాత్రం నజ్ముల్ హుస్సేనే.